తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం మండలం తోట మూల- వెనగడప మధ్య ఉన్న కట్టలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ వాగు ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు శనివారం స్థానికులు చెబుతున్నారు.