తిరువూరు నియోజకవర్గ పరిధిలోని మల్లెల గ్రామంలో మంగళవారం కోడిపందేలలో సెల్ ఫోన్ లు, నగదు దొంగలు హల్ చల్ చేశారు. సెల్ ఫోన్ దొంగిలిస్తున్నాడని అనుమానంతో ఒక వ్యక్తిని కొందరు సెల్ ఫోన్ బాధితులు దేహశుద్ధి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కోడిపందాలలో కొందరు సెల్ ఫోన్లు దొంగిలించబడ్డాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు తిరువూరు ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ తెలిపారు.