తిరువూరు: కవిత్వంతో చైతన్యం తీసుకురావాలి
కవులు వివిధ వర్తమాన సమస్యలను అధ్యయనం చేసి రాసే కవితలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చని ప్రముఖ రచయిత్రి వి.అనసూయ అన్నారు. సోమవారం లైబ్రరీ వారోత్సవాలను పురస్కరించుకొని తిరువూరు స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టి. ఉమామహేశ్వరవు, వి. ఇందిర, ఈ. వి. భరత కుమారి, వి. శంకరాచారి, యం. రాం ప్రదీప్ తదితరులు తమ కవితలతో అలరించారు.