
పెనుగొలను శివాలయంలో కళాకారులకు సన్మానం
గంపలగూడెం మండలం పెనుగొలను శివాలయంలో బుధవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో కళాకారులు, కవులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వి. నారాయణరావు అధ్యక్షత వహించిన సభలో వివిధ ప్రాంతాలకు చెందిన 24 మందిని వివిధ రంగాలు చెందిన వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చండీ ఉపాసకులు జి. కోటేశ్వరరావు శర్మ, జిల్లా సిపిఐ నాయకులు పసుపులేటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.