వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి

53చూసినవారు
వ్యక్తిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్‌లో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమ ప్రతిరోజూ వరద బాధితులకు సాయం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి టీడీపీ కార్యాలయానికి వచ్చి తమకు ఎటువంటి వరద సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మాటా మాటా పెరగడంతో ఆ వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు ఆఫీస్ వద్ద ఉన్న ఒక స్థంభానికి కట్టేసి కొట్టారు. సాయం అందలేదని వాదిస్తే దాడి చేస్తారా అంటున్న స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్