ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విజయవాడ విడిది కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నియమితులైన నారాయణను మంత్రి శాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం పలు ఆర్టీసి అంశాల పై చర్చించారు. ఆయన వెంట యరపతినేని శివ ఉన్నారు.