ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో హత్యకు సంబంధించి పశ్చిమ జోన్ ఇన్ చార్జ్ డిసిపి రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసిపి దుర్గారావు, ఇబ్రహీంపట్నం ఇన్ చార్జ్ ఇన్స్పెక్టర్ గురు ప్రకాష్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసిపి జి రామకృష్ణ మాట్లాడుతూ అక్రమ సంబంధం నేపథ్యంలోనే తల్లిని కూతురు, సంబంధం ఏర్పాటు చేసుకున్నవ్యక్తితో కలిసి రోకలి బండతో హత్య చేయడం జరిగిందని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశారు.