విజయవాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ హాల్ లో డిసెంబర్ 21వ తేదీ నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ బాబు మంగళవారం తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తి గల ఫెన్సింగ్ క్రీడాకారులు ఫెన్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్లో 19వ తేది నుంచి రిజిస్టర్ చేసుకోవాలన్నారు.