ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతృత్వంలో శనివారం తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో గద్దె క్రాంతి నిర్వహించిన రక్త దాన శిభిరంలో టీడీపీ నేత బెజవాడ నజీర్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నజీర్ మాట్లాడుతూ టీడీపీ పార్టీని స్థాపించిన 9నెలల్లోనే అధికారం జేజిక్కించుకొని రికార్డు సృష్టించారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.