Mar 21, 2025, 16:03 IST/
ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రమాదం.. మహిళ మృతి
Mar 21, 2025, 16:03 IST
TG: ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని లిఫ్ట్ గుంటలో పడి మహిళ మృతి చెందింది. అయితే గుండెపోటుతో ఓ మహిళ ఆసుపత్రికి రాగా.. స్టంట్ వేయడానికి నాలుగో అంతస్తుకు తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగి గుంటలో eపడిపోయింది. ఈ ప్రమాదంలో సదరు మహిళ మృతి చెందగా.. ఆమెతో ఉన్న మరో ఇద్దరు ఆసుపత్రి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.