విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి పరిశీలించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావుఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే సుజనా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ను పరిశీలించామనిఅభివృద్ధికి అవసరమయ్యే సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.