ఆదోని పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. శుక్రవారం పట్టణంలోనీ శరఫ్ బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య గురించి అధికారులతో చర్చించామని తొందర్లోనే ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామన్నారు. తప్పనిసరిగా అందమైన ఆదోనిగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పోలీసు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.