కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుందని శుక్రవారం టీబీ డ్యాం బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో 34, 289 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 92. 27 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. కుడి, ఎడమ కాల్వలకు 9, 896 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.