దేవనకొండ మండలంలోని పొలాలకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం దేవనకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మిదేవమ్మ, ఎంపీడీవో గౌరీదేవికి రైతుసంఘం నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలు, మోడల్ స్కూల్ ఏర్పాటు చేసేలా చేయాలని విద్యార్థి సంఘాలు కోరారు. సూరి, మహాబుబ్భాష బాషా పాల్గొన్నారు.