ఆలూరు మండలంలోని పెద్దహోతూరు గ్రామంలో శుక్రవారం చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న తిక్కన్న బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి వలస వెళ్లాడు. ఇంటి తలుపు తాళం పగలగొట్టినట్లు సమాచారం రావడంతో వచ్చి చూడడంతో దొంగలు బీరువాలో ఉంచిన 4 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, భార్య డెలివరీ కోసం దాచుకున్న రూ. 60 వేల నగదును దోచుకెళ్లారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.