పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో దళిత మహిళ గోటిందమ్మ దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కోడిగుడ్ల ఏసేపు, విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు ఆసుపత్రిలో గోవిందమ్మను కలిసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గోవిందమ్మ దాడి వెనుక ఉన్న వారందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.