ఆలూరు టిడిపి ఇన్చార్జ్ ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రూ. లక్ష చెల్లించిన వారికి టీడీపీ నుంచి శాశ్వత సభ్యత్వం అందించామని పేర్కొన్నారు. నియోజవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు రికార్డు స్థాయిలో నిర్వహించాలని సూచించారు. రూ. 100తో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు.