ఆస్పరి మండలం బిలేకల్ గ్రామానికి చెందిన యువకుడు ఉరుకుందు(18) నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం తల్లి లక్ష్మి మాట్లాడుతూ. కడుపు నొప్పితో ఇంట్లో ఉన్న టమాటా పొలానికి ఉపయోగించే మందు తీసుకెళ్లి, ఇంటి మిద్దె పైన తాగడం జరిగిందన్నారు. గమనించిన వారు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.