విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు: ఎమ్మెల్యే దస్తగిరి

75చూసినవారు
విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గులు దస్తగిరి అన్నారు. సోమవారం ప్యాలకుర్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి, ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వందరోజుల పాలన చూస్తే పింఛన్లు పెంపు, డీఎస్సీ నోటిఫికేషన్, పంచాయతీలకు నిధులు, పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారన్నారు. కోడుమూరు ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్