కోడుమూరులో నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్టు

64చూసినవారు
కోడుమూరులో నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
కోడుమూరు సెబ్ పోలీసుస్టేషన్ పరిధిలోని వెల్దుర్తి మండలం లక్ష్మినగరం గ్రామంలో సోమవారం సెబ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రంగస్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 20లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో సెబ్ సీఐ రామాంజినేయులు, ఎస్సై అలీబేగ్, సిబ్బంది హనుమంతు, వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్