లోకాయుక్త సంస్థ ఆవరణలో వేడుకలు

83చూసినవారు
లోకాయుక్త సంస్థ ఆవరణలో వేడుకలు
కర్నూలు నగరంలోని లోకాయుక్త సంస్థ ఆవరణలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి లోకాయుక్త చీఫ్ జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అంతకు ముందు పతాకావిష్కరణ చేసి జాతీయ జెండాకు వందనం సమర్పించారు. ప్రతిభ చూపిన ఉద్యోగస్తులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్