ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా రామయ్యను గెలిపించండి: ఎమ్మెల్యే అభ్యర్థి

72చూసినవారు
ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా రామయ్యను గెలిపించండి: ఎమ్మెల్యే అభ్యర్థి
ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక శనివారం ఎమ్మిగనూరులోని 21వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఆమె ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, తనను ఎమ్మెల్యేగా, బీవై రామయ్యను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్