కర్నూలు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో అక్టోబరు 2వ తేదీ నాటికి కంప్యూటరీకరణ పూర్తి చేయాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్, డీసీసీబీ పీఐసీ చైర్ పర్సన్ బి. నవ్య పీఏసీఎస్ సీఈవోలను ఆదేశించారు. బుధవారం కర్నూలులో ఆమె మాట్లాడారు. పీసీసీఎస్ లు కంప్యూటర్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయని, నిర్దేశిత గడువులోపు కంప్యూటరీకరణ పూర్తి చేయాలని సూచించారు.