కన్నుల పండుగగా కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

83చూసినవారు
పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో శనివారం కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు, పండితులు అధ్యర్యంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను విశేషంగా అలంకరించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి గణపతి పూజ, పుణ్యాహవాచనం, మాంగళ్య ధారణ, అక్షింతలు సమర్పణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్