పత్తికొండ: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం క్రిష్ణగిరి మండలం టీ. గోకులపాడు, తోగర్చేడు, రామక్రిష్ణాపురం, ఎరుకలచెరువు గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి, వారు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలభివృద్ధి శూన్యమన్నారు. 100 రోజులలో గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.