బావిలో పడి వివాహిత మృతి

85చూసినవారు
బావిలో పడి వివాహిత మృతి
ఎమ్మిగనూరు మండలంలోని సిరాళ్లదొడ్డి సమీపంలో శుక్రవారం పద్మావతి (31) అనే వివాహిత ఆమె సొంత పొలం లోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు గ్రామీణ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలుపలికి తీశారు. కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్సై పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్