ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీ చేశారు.మార్కెట్ యార్డ్ మొత్తం పరిశీలించి అక్కడ ఉన్న రైతులకు యార్డులో ఏవైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ రైతులకు విశ్రాంతిభవనం టాయిలెట్స్ వంటి సరైన సదుపాయాలు లేవని వీటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి రైతులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపడతామన్నారు.