వాస్తవాలు రాసే ఓ విలేకరిపై చర్యలు తీసుకోవాలని అనవసరంగా డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆదోని టీడీపీ మాజీ ఇన్ ఛార్జి గుడిసె క్రిష్ణమ్మను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని భీమాస్ కూడలి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, నాయకులు దేవదాస్, మల్లికార్జున మాట్లాడారు. వాస్తవాలు రాసే విలేకరిపై కేసులు పెట్టాలని పురమాయించడం ఏమిటని ప్రశ్నించారు.