కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాలతో, జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం వాహనాల తనిఖీలు చేపట్టి రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆదోని డివిజన్ పరిధిలోని పలు మండల కేంద్రాల్లో పోలీసులు అక్రమ రవాణా నివారణ కోసం, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ రవాణా జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.