ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గిందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. గురువారం 10, 569 క్యూసెక్కుల నీరు చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 77 టీఎంసీల నిల్వ ఉందన్నారు. 10, 113 క్యూసెక్కుల నీటిని వివిధ కాల్వలకు విడుదల చేస్తున్నామని వివరించారు.