ఎయిడెడ్ స్కూల్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తి చేయాలి: సీపీఎం

560చూసినవారు
ఎయిడెడ్ స్కూల్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తి చేయాలి: సీపీఎం
ఆదోని పట్టణంలోని ఎయిడెడ్ స్కూల్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు రామాంజినేయులు, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, గోపాల్, డిమాండు చేశారు. పట్టణంలోని హలమ్మ, గంగమ్మ కన్నడ ప్రాథమికోన్నత స్కూల్, మసూదియా అరభిక్ స్కూల్ నందు సీపీఎం పట్టణ కమిటి అధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. కన్నడ ప్రాథమిక స్కూల్ 1956 సంవత్సరంలోదాతల సహాకారంతో స్థాపించారు.ఆదోని పట్టణము కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో కన్నడ మీడియం స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కప్పుడు విధ్యార్థులతో కిటకిటలాడుతున్న స్కూలు ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధ్యాయల నియామకం చేపట్టకపోవడంతో ఎయిడెడ్ స్కూల్ మూత పడే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. కనీసం విధ్యార్థులకు పాట్య పుస్తకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని వారు తెలిపారు. అధే విధంగా మసుధియా అరభిక్ హై స్కూల్, ప్రాథమిక స్కూల్ లో ఉపాధ్యాయుల కోరత చాలా త్రీవంగా ఉందని వారు తెలిపారు. కావునా అధికారులు వెంటనే స్పందించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తి చేయాలని వారు డిమాండు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్