ఆళ్లగడ్డ పట్టణంలోని మౌళి వీధిలో బీరువాళ్ళ భాషా స్వగృహంలో మైనార్టీ హక్కులపై ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష అలియాస్ హుస్సేన్ వల్లి, ఆవాస్ కమిటీ నాయకులు నిజాముద్దీన్ రాజ్యాంగం ద్వారా మైనార్టీలకు కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఇస్మాయిల్ బేగ్, పసివుల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.