లోన్ యాప్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురువారం అన్నారు. లోన్ యాప్ అనేది మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాలకు ఇది ఒక బిగ్గెస్ట్ క్రైమ్ గా మారిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తెచ్చారు. పేద మధ్యతరగతి వాళ్లు ఫోన్ల ద్వారా లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి సమాజంలో కొన్ని వందల లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.