మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‍లో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేష్ హజరయ్యారు. "పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రూ.200 పెన్షను రెండు వేలు చేసింది మనమే. ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది మనమే. దీపం పథకం కింద ఉచితంగా సుమారుగా కోటి సిలిండర్లు అందజేశాం. 16,347 పోస్టులతో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం" అని లోకేష్ తెలిపారు.