గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కులవృత్తులను బలోపేతం చేస్తుంటే కొందరు హేళన చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన మొదటి పదేళ్లలో సంక్షేమ బడ్జెట్‌లో 70 శాతం బీసీలకే ఇచ్చామని కవిత తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వల్ల రాష్ట్రంలో రిజర్వేషన్ శాతం 54కు చేరిందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోసం కేంద్రం 50 శాతం దాటి రిజర్వేషన్ ఇచ్చిందని కవిత పేర్కొన్నారు.