తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన ఇన్ ఫ్లో
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని టీబీ డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. గురువారం 11, 244 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోందని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 101. 14 టీఎంసీల నిల్వ ఉందన్నారు. 13, 180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.