ఆలూరులో విజయం ఎవరికి వరించేనో..!
ఆలూరు నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 9సార్లు కాంగ్రెస్, 3సార్లు టీడీపీ, 2సార్లు వైసీపీ, ఒక్కసారి స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. కాగా 1987లో ఉప ఎన్నిక జరగగా అందులో టీడీపీ గెలుపొందింది. ఆలూరు నియోజకవర్గంలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ తరుపున వ్యాపారం విరుపాక్షి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున వీరభద్రగౌడ్ పోటీ చేస్తున్నారు. కాగా 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి గుమ్మగూరు జయరామ్ టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై పోటీ చేసి 39,896 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయన గుంతకల్ టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.