హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిందే. ఏప్రిల్ 23న పోలింగ్.. 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుంది. జీహెచ్ఎంసీలో సరైన బలం లేకపోవడంతో బరిలోకి దిగే యోచనలో లేదు. కాగా, రేవంత్ సర్కార్ సూత్రప్రాయంగా ఎంఐఎంకి మద్దతు ఇస్తున్నట్టు సమాచారం.