హొళగుంద మండలంలోని గజ్జహళ్లిలో ఈనెల 14న పిడుగుపాటుకు గురై, ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురువ అనసూయ (32) కోలుకోలేక శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలంలో పని చేస్తుండగా, ఆమెకు కొంత దూరంలో పిడుగుపడింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అనసూయను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు.