ఆలూరులోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌తరగతులు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ ఐటీ వృత్తి విద్య అధ్యాపకుడు ప్రకాష్ శనివారం తెలిపారు. పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 10 రోజుల పాటు పైథాన్ ప్రోగ్రాం, డిజిటల్ డాక్యుమెంటేషన్, కంప్యూటర్ పరిజ్ఞానంపైన అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలన్నారు.