ఆలూరు నియోజకవర్గంలోని హలహర్వి మండలంలో శుక్రవారం ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారితీసింది. బిలేహల్ లో ఒక ప్రేమ జంట పరారైంది. దీంతో అమ్మాయి తండ్రి సోము, అబ్బాయి తండ్రి మధకప్ప కుటుంబ సభ్యులు ఇరువర్గాల ఘర్షణ పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని, ఇరువర్గాలను శాంతింపజేశారు. కాగా ప్రేమికులు ఇరువురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రేమ జంట పరారు వ్యవహారంపై విచారణ చేపట్టారు.