ఆలూరు ఎమ్మెల్యే అనుచరులను కఠినంగా శిక్షించాలి

84చూసినవారు
ఆలూరు ఎమ్మెల్యే అనుచరులను కఠినంగా శిక్షించాలి
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు తన అనుచరులతో కలిసి పవన విద్యుత్ సంస్థలపై దాడిచేయడాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఆయా కార్యాలయాల్లోని కంప్యూటర్, ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సోదరుడు, తన అనుచరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్