హాలహర్వి మండలం గూళ్యం వద్ద వేదవతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే నది దాటితే బళ్లారి, శిరుగుప్ప ప్రాంతాలకు వెళ్లేందుకు వీలవుతుంది. దీంతో పడవ ప్రయాణం ద్వారా గూళ్యం నుంచి అవతలి వైపునకు చేరుకుంటున్నారు. ఇది ప్రమాదం అని తెలిసినా తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.