కర్నూలు జిల్లాలో మరో నాలుగు ఇసుక రీచ్ లు ఏర్పాటు

64చూసినవారు
కర్నూలు జిల్లాలో మరో నాలుగు ఇసుక రీచ్ లు ఏర్పాటు
కర్నూలు జిల్లాలో మరో నాలుగు ఇసుక రీచ్లను అందుబాటులోకి తేచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు గనులు, భూగర్భ ఖనిజాల శాఖ ఉప సంచాలకులు రవిచంద్ శనివారం తెలిపారు. ఇసుక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కౌతాళం మండలం నదిచాగి, మరళి 1, 2 తోపాటు గుడికంబాలి రీచ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 66 టన్నుల ఇసుక సరఫరా చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్