ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను హొళగుంద మండల తహశీల్దార్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సతీశ్ కుమార్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ సబ్ కలెక్టర్ కు పూల మొక్కను అందజేశారు. అలాగే, మండలంలోని రైతుల భూ సమస్యలపై సబ్ కలెక్టర్టో చర్చించారు. రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.