కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు 16 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా చిప్పగిరిలో 38. 4 మి. మీ వర్షపాతం నమోదైంది. కోసిగి, పెద్దకడుబూరు, ఆదోని, హొళగుంద, మద్దికెర, ఆలూరు, హాలహర్వి తదితర మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చిప్పగిరి మండలం సాధారణ వర్షపాతం 89. 5 మి. మీ ఉండగా రికార్డు స్థాయిలో 420. 6 మి. మీ వర్షపాతం నమోదైంది.