నటుడు సోనూసూద్ పేదయువతి చదువుకు సాయంచేసి మరోసారి రియల్ హీరో అనిపించు కున్నారు. ఆస్పరి మండలం బనవనూరుకు చెందిన దేవికుమారీ బీఎస్సీ చదవాలనుకున్నా రు. కుటుంబ ఆర్థికస్థితి బాగాలేకపోవడం తో ఓ నెటిజన్ సాయంకావాలని కోరుతూ ట్వీట్ చేశారు. సోనూసూద్ను ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్ 'దేవికుమారీ. కాలేజ్లో అడ్మిషన్ అయిపోయింది. బాగా చదువుకో' అని తాజాగా ట్వీట్ చేశారు. అందుకు ఆమె ఆయన కు శనివారం కృతజ్ఞత తెలిపారు.