మంత్రి బీసీ చొరవతో విద్యార్థి బస్సు ఏర్పాటు

553చూసినవారు
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చొరవతో కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లె గ్రామ విద్యార్థులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గురువారం టీడీపీ నాయకులు ఐవీ పక్కీరారెడ్డి, బాలిరెడ్డి, జయలక్ష్మీరెడ్డిలు ఉమ్మాయిపల్లె నుంచి పెన్నా స్కూల్ కు వెళ్లే విద్యార్థి బస్సును ప్రారంభించారు. బస్సు కోసం మంత్రి బీసీ సంప్రదించగా వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారన్నారు.

సంబంధిత పోస్ట్