అవుకు మండలంలోని స్థానిక ఏపీ మోడల్ స్కూల్ నందు తొమ్మిదవ తరగతి విద్యార్థులు వృత్తి విద్యలో భాగంగా అవుకులో గల సబ్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ కి సంబంధించిన విషయాలను ఏఈ పకీరయ్య విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.హేమీమా, వైస్ ప్రిన్సిపాల్ కే. మునీంద్ర, కే. రమణ, వృత్తి విద్య ఉపాధ్యాయుడు నరేంద్ర పాల్గొన్నారు.