ఈనెల 18న కర్నూల్ పోలీస్ కాలేజ్ గ్రౌండ్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సు జరుగనుంది. మాదిగ ఉపకులాల ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని నందికొట్కూరు ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ కె.వి. రమణ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాహ్మకొట్కూర్, కొనేటమ్మ మారుతి నగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి సమ్మేళన ఉద్దేశాలు ప్రజలకు వివరించారు.